మెగా హీరో చిరంజీవి నటించే 150వ సినిమాకు ఎన్నో ప్రత్యేకలు కనిపించేలా ఉన్నాయి. ఈ చిత్రానికి చిరంజీవి భార్య సురేఖ తొలిసారి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. నాన్న 150వ సినిమా మైలు రాయిలాంటి సినిమా,అందులో తాను కూడా తప్పకుండా ఒక ఫ్రేమ్‌లోనైనా నటిస్తానని వెల్లడించారు.
చిరంజీవి 150వ సినిమా కోసం ఇప్పటికే చాలా కథలు విన్నారు. మరింత బెస్ట్ స్టోరీ కావాలని కోరుకుంటున్నారు. చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు కావడంతో ఈ చిత్ర కథపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాన్న ఇమేజ్‌కు సరిపోయే కథ అందిస్తే రూ.1 కోటి బహుమతి ఇవ్వడానికి సిద్ధమేనని చరణ్ ప్రకటించిన విషయం తెల్సిందే.రామ్ చరణ్ ఆఫర్‌ను ఎలాగైనా దక్కించుకోవడానికి పలువురు రచయితలు పోటి పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.....?ఇక చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన వెల్లడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment