వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను అంతర్జాతీయ నగరాలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌కు, తెలంగాణకు వరాలు కురిపించారు. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాలను అంతర్జాతీయ స్థాయి నగరాలుగా మారుస్తామన్నారు. నాలుగేళ్లలో తెలంగాణలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు. మానేరు గార్డెన్‌ను బృందావనంగా మారుస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇంటింటికి తాగునీటి కోసం 25వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రణాళిక చేసినట్లు తెలిపారు. పాలమూరులో రూ.500 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ఇందుకోసం 15 రోజుల్లో నిధులు విడుదల చేస్తామన్నారు.

No comments:
Post a Comment