స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా హీరోలకు వరంగా మారుతున్నాడు. ఓ వైపు హిట్టు సినిమాలతో దూసుకపోతూ, మరో వైపు సింగిల్ గా సిమాలు చేస్తూనే పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించమని అడిగితే కాదనకుండా ఒప్పేసుకుంటున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ ‘ఎవడు ’లో కీలక పాత్ర పోషించిన ఆయన దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఆయన అభ్యర్థన మేరకు ‘గోన గన్నారెడ్డి ’ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసందే.
ఇప్పుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న మెగా బ్రదర్ తనయుడు నాగబాబు కొడుకు ‘వరుణ్ తేజ్ ’ ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ‘ ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్న ‘గొల్లభామ ’ సినిమాలో గెస్టు పాత్రను పోషించడానికి కమీట్ అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర ఉండటంతో దాని కోసం పలువురు హీరోలను శ్రీకాంత్ అడ్డాల సంప్రదించినా చివరకు అల్లు అర్జున్నే ఎంపిక చేశాడట.
ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హగ్దే నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు......
No comments:
Post a Comment