గ్రూప్ హెచ్ లో బెల్జియమ్ కి అల్జీరియాకి మధ్య బెలో హారిజాన్టో లోను, రష్యాకి సౌత్ కొరియాకి మధ్య క్యూబా లోను జరుగుతున్న పోటీతో ఈ రోజు ఓపెనింగ్ రౌండ్ పూర్తవుతోంది.
బెల్జియమ్ జట్టు మంచి ఆటగాళ్లున్నారు. చేల్సియా ప్లేమేకర్ ఇడెన్ హజర్డ్, మంచి శక్తివంతమైన స్ట్రైకర్ రోమేలు లుకాకు ఉన్నారు. మరో పక్క నాల్గవ సారి వర్ల్ డ్ కప్ లో పాల్గొంటున్న అల్జీరియా ఇంతవరకు గ్రూప్ స్థాయి నుంచి పైకి పోలేదు.
రష్యా 2002 తర్వాత మళ్ళీ సాకర్ వర్ల్ డ్ కప్ పోటీల్లో అడుగుపెట్టింది.
బ్రెజిల్ ఈరోజు మెక్సికో మీద గెలిచి 16 టీమ్ లలో స్థానం సంపాదించుకోవటమైతే ఖాయమే. దీనితో ఆ జట్టుకి పెద్ద టెన్షన్ తగ్గిపోతుంది. ఐదుసార్లు ఛాంపియనైన బ్రెజిల్ క్రోటియా మీద 3-1 తో గెలిచింది. మెక్సికో 1-0 స్కోర్ తో కేమెరూన్ మీద గెలుపొందింది.
రెండు సంవత్సరాల క్రితం సౌత్ అమెరికా మీద 2.-1 తో గెలుపొందిన బ్రెజిల్ మెక్సికో వలన ఆశించిన ఒలింపిక్ గోల్డ్ దక్కించుకోలేకపోయింది. అయితే ఈసార్ ఏదో ప్రతీకారం తీర్చుకోవటానికన్నట్లుగా ఆడబోమని బ్రెజిల్ స్ట్రైకర్ హల్క్ అన్నారు.
No comments:
Post a Comment